Bruce Lee Quotes In Telugu, Bruce Lee Inspirational Telugu Quotations
Bruce Lee Quotes In Telugu, Best Motivational Bruce Lee Sayings In Telugu. Martial Arts Hero Bruce Lee Quotes in Telugu That Inspires us. Bruce Lee Philosophy Sayings, Teachings In Telugu Best Images, Wallpapers, Share on Whatsapp.
బ్రూస్ లీ కోట్స్ తెలుగులో, ( బ్రూస్ లీ సూక్తులు )
మార్షల్ ఆర్ట్స్ ధీరుడు బ్రూస్ లీ చెప్పిన కొటేషన్స్ తెలుగులో, బ్రూస్ లీ 1940 నవంబర్ 27వ తేదీన అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కొ లో జన్మించాడు. బ్రూస్ లీ ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు ఎలాంటి వాడైనా సరే ఒక్క దెబ్బతో మట్టికరిపించగల ధీరుడు. కుంఫు, కరాటే నేర్చుకునే వారికి ఆరాధ్యదైవం బ్రూస్ లీ. బ్రూస్ లీ సినీ పరిశ్రమలో హీరోగా చాల సినిమాలు చేశాడు.
మనలో స్ఫూర్తిని నింపే బ్రూస్ లీ సూక్తులు తెలుగులో.
Bruce Lee Quotes In Telugu - Images
Bruce Lee Telugu Quotations - Text
బ్రూస్లీ గురించి తెలుగులో
బ్రూస్ లీ 1940 నవంబర్ 27వ తేదీన అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కొ లో జన్మించాడు. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలం తరువాత ఆయన కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్ కి వచ్చేశారు. బ్రూస్ లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు ఆయన బ్రూస్ లీ ని కూడా అప్పుడప్పుడు షూటింగ్ కి తీసుకెళ్లేవారు. దాంతో బ్రూస్ లీ చిన్న వయసులోనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. అలా నటనతో పాటు బ్రూస్లీ డాన్స్ కూడా నేర్చుకున్నాడు.
అప్పట్లో అమెరికాలోని హాంకాంగ్ లో మాఫియా గ్యాంగ్ లు పాలించేవి. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్ లీ కి పద్నాలుగేళ్ళ ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్ లీ తో గొడవపడి బ్రూస్ లీ ని గట్టిగ కొట్టారు. ఆ సంఘటననే బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్ నేర్చుకునేలా చేసింది. తనను తాను రక్షించుకోవడం కోసం బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు.
అప్పట్లో కుంగ్ ఫు లో నెంబర్ వన్ అయిన ఇప్ మాన్ ఆయన దగ్గర కుంగ్ ఫు నేర్చుకున్నాడు, స్కూల్లో మరోసారి ఆ గ్యాంగ్ దాడికి దిగారు. కానీ, ఇప్పుడు బ్రూస్లీ ఇంతకు ముందులా కాదు. ఈసారి గొడవలో ఒకరి పళ్ళు ఊడిపోయేలా, మరొకరి చేయి విరిగిపోయేలా చితకొట్టాడు. ఇలా చేసినందుకు బ్రూస్లీ ని ఇంకోసారి గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీస్ లు బ్రూస్ లీ తండ్రిని హెచ్చరించారు.
అయితే ఈ మాఫియా గ్యాంగ్ నుండి దూరంగా ఉంచడం కోసం ఆయన తల్లిదండ్రులు 18 ఏళ్ల వయసున్నా బ్రూస్ లీ ని కాలిఫోర్నియాలోని తన స్నేహితులు ఇంటికి పంపేశారు. మళ్లీ పుట్టిన చోటికే వచ్చాడు బ్రూస్లీ. మొదట ఒక రెస్టారెంట్లో వెయిటర్ గా పనిచేశాడు, కొంతకాలం తరువాత యూనివర్సిటీ అఫ్ వాషింగ్టన్ లో ఫిలాసఫీ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు.
ఆ మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్లీ క్రేజ్ పెరిగిపోయింది, ఎంతో మంది స్నేహితులు బ్రూస్లీ దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు, అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే 1963లో 'Jun Fan Gung Fu' అనే మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేసాడు. కొంతకాలం తర్వాత తన కాలేజీ స్నేహితురాలు అయినటువంటి 'లిండా లీ క్యాడ్‌వెల్' అనే ఆమెను ప్రేమించి 1964లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. (క్రెడిట్స్ ; తెలుగుబడి)
తెలుగు కొటేషన్స్