Che Guevara Quotations in Telugu, Che Guevara Powerful Quotes In Telugu
Che Guevara Quotes in Telugu, Che Guevara Telugu quotes, Best Motivational, Inspirational Che Guevara Quotations In Telugu. Best Images, Wallpapers Share on Whatsapp
చెగువేరా కోట్స్ తెలుగులో ( చేగువేరా సూక్తులు )
చేగువేరా కొటేషన్స్ తెలుగులో, చేగువేరా తెలుగు కోట్స్. చేగువేరా ఒక వైద్యుడు, ఒక మానవతావాది, రచయిత, ఉద్యమకారుడు.
Che Guevara Quotes In Telugu - Images
Che Guevara Telugu Quotations - Text
చెగువేరా గురించి తెలుగులో
చెగువేరా పూర్తి పేరు 'ఎర్నెస్టో రాఫెల్ గువేరా డి లా సెర్నా'ఆయన జూన్ 14, 1988 సంవత్సరంలో అర్జెంటీనాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చేగువేరా కి చిన్నవయసులోనే ఆస్తమా వ్యాధి సోకింది, దానితో శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు, మొదట్లో ఇంజనీరింగ్ లో చేరాడు, కానీ అది నచ్చక అది మానేసి మెడిసిన్లో చేరాడు, మెడిసిన్ చదువుతున్నప్పుడు లాటిన్ అమెరికా అంతా ఒకసారి పర్యటించాలనుకున్నాడు.
1952లో తన స్నేహితుడితో కలిసి ఒక మోటార్ సైకిల్ మీద లాటిన్ అమెరికా అంతా పర్యటించడానికి బయలుదేరారు. ఆ ప్రయాణమే చేగువేరా జీవితంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. అమెరికాలోని దక్షిణ ప్రాంతాన్ని లాటిన్ అమెరికా అని కూడా అంటారు.ఈ భాగంలోని దేశాలన్నీ కూడా పేదరికంతో నిండిపోయి వుండేవి.
ఉత్తరమెరికాలోని ధనవంతులైన పెట్టుబడిదారులు మరికొంతమంది దోపిడీదారులు ఈ పేద దేశాల్లోనీ గనులు భూభాగాలను ఆక్రమించుకొని అక్కడ ఫ్యాక్టరీలను నిర్మించి ఆ ప్రాంతంలో నివసించే పేద ప్రజలను కూలీలుగా మార్చి వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించేవారు. ఇక్కడి సంపదను వారు దోచుకునేవారు.
చేగువేరా చేస్తున్న ఈ ప్రయాణంలో భాగంగా లాటిన్ అమెరికాలోని ప్రజల బానిస బ్రతుకులను కళ్లారా చూసి చలించిపోయాడు. వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకున్నాడు, అలా తొమ్మిది నెలల పాటు ప్రయాణం సాగిన తరువాత వెనక్కి తిరిగి వచ్చి 1953లో మెడిసిన్ లో డిగ్రీ సంపాదించుకున్నాడు చేగువేరా.
యుక్త వయస్సు నుండి మార్క్సిజం మీద ఆ విధానాల మీద చేగువేరాకు ఆసక్తి ఉండేది. లాటిన్ అమెరికాలోని సామ్రాజ్యవాదులను ఎదుర్కోవడానికి తన వైద్య వృత్తి సరిపోదని 'విప్లవం' ఒక్కటే మార్గమని అర్థం చేసుకున్నాడు. తాను చేయాలనుకుంటున్న దాని గురించి తన తల్లిదండ్రులకు చెప్పి బొలివియా లో తన విప్లవాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు, అయితే అక్కడ నాయకత్వం లోపం ఉండటం వల్ల అక్కడి నుండి 'గ్వాటెమాల'కు చేరుకున్నాడు, అక్కడే ఎంతోమంది విప్లవ నాయకులతో పరిచయం ఏర్పడింది.
ఆ సమయంలోనే హిల్డా అనే ఒక అమ్మాయితో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి కూడా జరిగింది. వాళ్ళకి ఒక అమ్మాయి జన్మించింది, కొంతకాలం తర్వాత క్యూబాలో బటిస్టా నియంకృత పాలనకు వ్యతిరేకంగా విప్లవం చేస్తున్న కాస్ట్రో గురించి తెలుసుకున్నాడు. చేగువేరా కాస్ట్రో ని కలుసుకున్నాడు, ఆలా కాస్ట్రో చేగువేరా మరో 82 మంది తో కలిసి 'బటిస్ట'ను క్యూబా అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి ఒక షిప్ లో మెక్సికో నుండి క్యూబా కు బయలుదేరారు.
ఈ క్యూబా విప్లవ సమయంలోనే చెగువేరా మరియు తన భార్య హిల్డా విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సంవత్సరం అలీడా మార్చ్ అనే మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు చేగువేరా. కాస్ట్రో మరియు చేగువేరా క్యూబా చేరిన తర్వాత క్యూబా ప్రభుత్వానికి, రెబెల్స్ కి మధ్య విపరీతమైన దాడులు జరిగాయి, ఈ యుద్ధములో అమెరికా కలుగజేసుకొని బటిస్టా ప్రభుత్వానికి ఆయుదాలనందించి సహాయం చేసేది.
క్యూబా విప్లవం జరుగుతున్న సమయంలో దోపిడీదారులను పేదల నుండి దోచుకుంటున్న వాళ్ళను చేగువేరా వెతికి వెతికి చంపేవాడు. అందుకే దోపిడీదారులకు చేగువేరా వస్తున్నాడంటేఒంట్లో ఒణుకు పుట్టేది, అలా రెండు సంవత్సరాల తర్వాత కాస్ట్రో మరియు చెగువేరా కలిసి చేసిన విప్లవం విజయవంతమైంది. బటిస్టా నియంకృత ప్రభుత్వాన్ని దింపి క్యూబాలో కాస్ట్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. (క్రెడిట్స్ ; తెలుగుబడి)
👉 Bruce Lee Quotes In Telugu
తెలుగు కొటేషన్స్