Dalai Lama Quotations In Telugu
Dalai Lama Quotes In Telugu, Dalai Lama Motivational Telugu Quotes
దలైలామా సూక్తులు
'దలైలామా' టిబెట్ లోని గెలుగ్ శాఖకు చెందిన బౌద్ధుల ఆచార్య పదవి పేరు. టిబెట్ లోని సాంప్రదాయిక బౌద్ధ శాఖల్లో ఇది అత్యంత నవీనమైనది. దలైలామా కోట్స్ తెలుగులో.
Dalai Lama Quotes In Telugu - Images
Dalai Lama Quotes In Telugu - Text
ఏదైనా సాధించడానికి మీరు చాలా చిన్నవారు అన్న భావన మీకు కలిగితే, వెళ్లి దోమతో నిద్రించడానికి ప్రయత్నించండి.
- దలైలామా
ఒక యుద్ధంలో వేలాది మందిని జయించటం కంటే,
తనను తాను జయించుకోవడమే గొప్ప విజయం.
- దలైలామా
ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి:
మీరు మీ జీవితాన్ని అనుకున్న విధంగా జీవించకుండా ఉండటానికి అడ్డుకుంటోంది ఏది అని.?
- దలైలామా
మన జీవిత ముఖ్య ఉద్దేశ్యం. ఇతరులకు సాయం చెయ్యడమే.
అలా చేయలేకపోతే... కనీసం ఇతరులను బాధించకుండానైనా ఉండండి.
- దలైలామా
ఒక్కొక్కసారి మీకు కావలసినది పొందలేకపోవడం కూడా, మీ అదృష్టం యొక్క ప్రభావమే అని భావించండి.
- దలైలామా
ప్రతిరోజూ ఉదయం మీరు మేల్కొనేటప్పుడు ఈ విధంగా ఆలోచించండి:
ఈ రోజు నేను సజీవంగా ఉండటం నా అదృష్టం, నా జీవితంలో ఎంతో విలువైన, ఈ రోజుని నేను వృథా చేయను అని.
- దలైలామా
మీరు మాట్లాడితే మీకు తెలిసిన విషయాలని మాత్రమే మరలా చెబుతారు.
అదే వింటే, ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలరు.
- దలైలామా
క్రమశిక్షణ గల మనస్సు ఆనందానికి దారితీస్తుంది.
క్రమశిక్షణ లేని మనస్సు బాధలకు దారితీస్తుంది.
- దలైలామా
తెలుగు కొటేషన్స్
Tags:
Great People