Jiddu Krishnamurti Quotations In Telugu
Jiddu Krishnamurti Quotes In Telugu, Jiddu Krishnamurti is a philosopher from Andhra Pradesh. He was born on May 12, 1895, in Madanapalle, Andhra Pradesh to a Telugu Brahmin family.
From 1929 until his death in 1986 he traveled around the world giving many lectures on philosophical and spiritual matters. Highlights he touched on - mental revolution, emotional inquiry, meditation, human relationships, fundamental change in society.
జిడ్డు కృష్ణమూర్తి సూక్తులు
జిడ్డు కృష్ణమూర్తి కోట్స్ తెలుగులో, జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
అతను స్పృశించిన ముఖ్యాంశాలు: - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు.
అతను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు.
Jiddu Krishnamurti Quotes In Telugu - Images
Jiddu Krishnamurti Quotes In Telugu - Text
భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు.
- జిడ్డు కృష్ణమూర్తి
మనస్సు, హృదయం నిశ్చలంగా వుంటే ఉత్సాహం లభిస్తుంది.
- జిడ్డు కృష్ణమూర్తి
అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది. అది జ్ఞానం క్రింద చలామణి అవుతుంది.
- జిడ్డు కృష్ణమూర్తి
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
- జిడ్డు కృష్ణమూర్తి
చెప్పుడు కబురు ఏం చేస్తుందో చూడండి: ఒక కుటిల ఆలోచనతో మొదలవుతుంది, అసలు కుటిల ఆలోచనే ఒక నేరం. ప్రతి ఒక్కరిలోను, ప్రతి వస్తువులోను మంచి/చెడు రెండూ ఉన్నవి.
- జిడ్డు కృష్ణమూర్తి
సమస్యను కనుక మనం నిజంగా అర్ధం చేసుకోగలిగితే సమాధానం అందులోనే నుండే బయటపడుతుంది. ఎందుకంటే సమస్య, సమాధానం రెండూ విడివిడిగా ఉండవు.
- జిడ్డు కృష్ణమూర్తి
ఒక భయం లేని వ్యక్తి ఎప్పుడు క్రోధంగా ప్రవర్తించడు అతనిలో దౌర్జన్యం ఉండదు. అసలు దేనికి భయపడని వాడు, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఒక స్వతంత్ర వ్యక్తిలా జీవిస్తాడు.
- జిడ్డు కృష్ణమూర్తి
ఏకాంతంగా ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏకాంతంగా ఉండడం ఒంటరితనం కాదు. దాని అర్ధం మన మనసు సమాజం లోని చెడుకి, వారి ఆలోచనలకి దూరంగా ఉంటూ స్వచ్ఛంగా ఉండడమే.
- జిడ్డు కృష్ణమూర్తి
మనలో చాలా మందికి మరొకరితో బంధం ఏర్పడేది కేవలం ఒక అవసరం కోసమే… అది ఆర్దికపరమైనది కావచ్చు, శారీరక సంబంధం కావచ్చు. ఇలాంటి సంబంధాలనుండే భయం, నా స్వంతం అనే భావన, ఘర్షణ, నిరాశ మొదలైనవి పుడతాయి.
- జిడ్డు కృష్ణమూర్తి
ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలి. జీవితానికి మనసే మూలం. ప్రస్తుతంలో జీవిస్తునప్పుడే ఆనందం ఉంటుంది.
- జిడ్డు కృష్ణమూర్తి
నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన తల్లివి/తండ్రివి అనిపించుకోలేవు. ఈ ప్రపంచంలోని పిల్లలందరిని నీ బిడ్డలుగా నిండు మనసుతో భావించినప్పుడు మాత్రమే నీవు అసలైన తల్లివి /తండ్రివి అవుతావు.
- జిడ్డు కృష్ణమూర్తి
పుట్టినరోజు నుండి చనిపోయేవరకు మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు. అదొక అంతులేని ప్రక్రియ.
- జిడ్డు కృష్ణమూర్తి
భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేను పట్టించుకోను.. అదే నా రహస్యం.
- జిడ్డు కృష్ణమూర్తి
నీలో దాగిన జ్యోతిని నీవే వెలిగించుకోవాలి.
- జిడ్డు కృష్ణమూర్తి
వినడం అనేది ఒక సంపూర్ణ చర్య, ఆ వినే చర్యలోనే సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది.
- జిడ్డు కృష్ణమూర్తి
సుసృష్టంగా చూడాలంటే మనసు ఖాళీగా ఉండి తీరాలి.
- జిడ్డు కృష్ణమూర్తి
ఏది శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించడమే ఆనందం.
- జిడ్డు కృష్ణమూర్తి
సంతోషం భలే విచిత్రమైనది. అది కావాలి అని మనం కోరుకోకుండా ఉన్నపుడు మాత్రమే సంతోషం లభిస్తుంది.
- జిడ్డు కృష్ణమూర్తి
"ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. వాటంతట అవి విరామం లేకుండా ఆనందపడుతున్నట్లు కనిపిస్తాయి. వాటికి మృత్యువును గురించి చింతే ఉండదు. మృత్యువు ఆసన్నమైందా, రానీ వాటి పని అవి చేస్తాయి. ముందు ఏంజరుగుతుందో అనే ఆందోళన ఉండదు. క్షణం క్షణం సజీవంగా ఉంటాయి. మనకే, మనుష్యులకే మృత్యువు అంటే భయం. ఎప్పుడూ భయపడుతూంటాం. వృద్ధులు మృత్యువుకు చేరువగా ఉంటారు. యువకులు కూడా దీనికి ఎంతో దూరంలో ఉండరు. మృత్యుభావంతో మనం నిమగ్నులమై ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దాన్నిగాని, సంగ్రహించి పెట్టుకున్న దాన్నిగాని పోగొట్టుకోడానికి భయపడతాం. చేసుకున్న భార్యనుగానీ, భర్తనుగానీ, బిడ్డనుగానీ, స్నేహితునిగానీ పోగొట్టుకోడానికి భయపడతాం. మనం తెలుసుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. సంపాదించుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. మనం ప్రోగుచేసుకున్న వాటినన్నిటినీ - మన స్నేహితులను, మన ఆస్తులను, సంపత్తులను, మన గుణాలనూ, శీలాన్ని కూడా తీసుకువెళ్ళగలిగినప్పుడు మనం మృత్యువు అంటే భయపడం. అందుకే మృత్యువు గురించి, దాని తరువాత జీవితాన్ని గురించి, ఎన్నెన్నో సిద్ధాంతాలను సృష్టించుకుంటాం. కానీ అసలు విషయం మృత్యువు అంటే అది అంతం. దీనిని అనుభవించడానికి సమ్మతించం. తెలిసిన దానిని వదలదలచుకోము. కాబట్టి తెలిసినదానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనలో భయం కలుగుతూంది. అంతేగానీ తెలియని దానివల్ల కాదు. తెలియని దానిని తెలిసిన దానితో గ్రహించలేం. కానీ మన మనస్సు తెలిసినవాటితో ఉండి "నేను అంతం అయిపోతున్నాను" అన్నప్పుడు భయపడిపోతుంది."
- జిడ్డు కృష్ణమూర్తి
తెలుగు కొటేషన్స్