Ramakrishna Paramahamsa Quotes In Telugu
Ramakrishna Paramahamsa Quotes In Telugu, Best Ramakrishna Paramahamsa Telugu Quotes, True Life, Motivational, Inspirational, Real Life Ramakrishna Paramahamsa Sayings In Telugu. Best Images
రామకృష్ణ పరమహంస కోట్స్ తెలుగులో, ( రామకృష్ణ పరమహంస సూక్తులు )
రామకృష్ణ పరమహంస తెలుగు సూక్తులు, మనందరికీ స్ఫూర్తినిచ్చే మరియు నిజ జీవిత సత్యాలను, పాఠాలను తెలియజేసే రామకృష్ణ పరమహంస కొటేషన్స్ తెలుగులో బెస్ట్ ఇమేజెస్.
Ramakrishna Paramahamsa Quotes In Telugu - Images
Ramakrishna Paramahamsa Telugu Quotations - Text
ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు, మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం..
- రామకృష్ణ పరమహంస
నీ కోసం.. చప్పట్లు కొట్టే రెండు చేతులకన్నా, కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న.
-రామకృష్ణ పరమహంస
ఒక అమ్మ.. వందమంది ఉపాధ్యాయులతో సమానం...
-రామకృష్ణ పరమహంస
అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. కానీ, మంచితనం హృదయాన్నే దోచుకుంటుంది.
- రామకృష్ణ పరమహంస
మాట్లాడటం దేవుడిచ్చిన వరం, కానీ అదుపులో ఉంచుకొని మాట్లాడు.
- రామకృష్ణ పరమహంస
అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే, మనలోనూ అది పెరుగుతుంది.
- రామకృష్ణ పరమహంస
ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది.
- రామకృష్ణ పరమహంస
పదునైన ఆయుధం కంటే క్షణ కాలంలో వచ్చే కోపమే, అత్యంత ప్రమాదకరం.
- రామకృష్ణ పరమహంస
తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి పర్యవసానాన్ని తప్పించుకోలేరు.
- రామకృష్ణ పరమహంస
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి.
- రామకృష్ణ పరమహంస
మనం ఇష్టపడింది దొరకనప్పుడు, మనకు దొరికిన దాన్నే ఇష్టపడాలి.
- రామకృష్ణ పరమహంస
స్వర్గం అంటే మరింకేం కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండే వారి మనసు.
- రామకృష్ణ పరమహంస
తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాకపోవడమే ఉత్తమం.
- రామకృష్ణ పరమహంస
ఎక్కడ అహంకారం ప్రారంభం అవుతుందో, అక్కడ మనిషి పతనమూ ప్రారంభం అవుతుంది.
- రామకృష్ణ పరమహంస
సంతృప్తిగలవాడు నిత్య సంపన్నుడు, అత్యాశాపరుడు ఎప్పటికీ పేదవాడు.
- రామకృష్ణ పరమహంస
సోమరితనం మనిషి పతనానికి కారణం, దాన్ని విడిచి ప్రతి విషయాన్నీ సమగ్రంగా నేర్చుకోవాలనుకునేవారు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటారు.
- రామకృష్ణ పరమహంస
ఎంతటి విషమ పరిస్థితులెదురైనా మంచితనం, మానవత్వాలపై నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు.
- రామకృష్ణ పరమహంస
లేని వాటిని గుర్తు తెచ్చుకుని బాధపడటం కంటే, ఉన్న వాటిని గుర్తుచేసుకుని ఆనందంగా ఉండగలగడమే తెలివైనవారి లక్షణం.
- రామకృష్ణ పరమహంస
పదునైన ఆయుధంకంటే, క్షణ కాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం.
- రామకృష్ణ పరమహంస
సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడం, మన వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో కీలకం.
- రామకృష్ణ పరమహంస
సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవప్రదంగా ఉండలేడు.
- రామకృష్ణ పరమహంస
ఏం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసిన వాడు వివేకవంతుడు.
- రామకృష్ణ పరమహంస
మనల్ని చూసి చప్పట్లు కొట్టే పది వేళ్ల కన్నా, కన్నీరు తుడిచే ఒక్కవేలు మిన్న.
- రామకృష్ణ పరమహంస
స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవారి మనస్సే.
- రామకృష్ణ పరమహంస
తెలుగు కొటేషన్స్
Tags:
Great People