Dr. Sarvepalli Radhakrishnan Quotations In Telugu
Sarvepalli Radhakrishnan Quotes In Telugu, Dr. Sarvepalli Radhakrishnan, (September 5, 1888 - April 17, 1975) was the first Vice President of India and the second President.
Guided the Prime Ministers during India's most difficult times (wartime with China and Pakistan).
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ కోట్స్ తెలుగులో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ - భారతదేశ మాజీ రాష్ట్రపతి, పండితుడు, తత్వవేత్త మరియు భారతరత్న అవార్డు గ్రహీత.
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 5 సెప్టెంబర్ 1888 లో జన్మించారు. ఉపాధ్యాయులు సమాజానికి చేసిన కృషికి నివాళిగా సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. రాధాకృష్ణన్ గారు 17 ఏప్రిల్ 1975 లో మరణించారు.
Sarvepalli Radhakrishnan Quotes In Telugu - Images
Sarvepalli Radhakrishnan Quotes In Telugu - Text
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కానీ.. మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మంచి పనులకు పునాది క్రమశిక్షణే, అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది
-సర్వేపల్లి రాధాకృష్ణన్
దుఃఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం
- సర్వేపల్లి రాధాకృష్ణన్
అన్నదానం ఆకలిని తీరిస్తే.. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది
-సర్వేపల్లి రాధాకృష్ణన్
బయట కనిపించే మురికి గుంతల కన్నా..
మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మనకు ఉన్న సంపదతో సంతృప్తి పడటం ఉత్తమం, మనకున్న జ్ఞానం సరిపోతుందనుకోవడం అజ్ఞానం
- సర్వేపల్లి రాధాకృష్ణన్
శ్రద్ధగలవాడు మాత్రమే విద్యల్లో నేర్పు పొందగలడు
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మనిషికి తృప్తి తనకున్న సంపద విషయంలో ఉండొచ్చుగానీ విజ్ఞానం విషయంలో ఉండకూడదు
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మనం చేసే పనులు మంచివో, చెడ్డవో ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేవి మన జయాపజయాలే
- సర్వేపల్లి రాధాకృష్ణన్
సాధించాలనే తపన... మన లోపాలు, బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది
- సర్వేపల్లి రాధాకృష్ణన్
మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు
- సర్వేపల్లి రాధాకృష్ణన్
జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది
- సర్వేపల్లి రాధాకృష్ణన్
ఉన్నత లక్షాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే
- సర్వేపల్లి రాధాకృష్ణన్
చదువుకి క్రమశిక్షణ తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుంటుంది
- సర్వేపల్లి రాధాకృష్ణన్
గొప్పదనం అనేది చెప్పే మాటలతో రాదు చేసే పనుల నుంచి వస్తుంది
- సర్వేపల్లి రాధాకృష్ణన్
తెలుగు కొటేషన్స్
Tags:
Great People