Warren Buffett Quotes In Telugu, Inspirational Telugu Quotations
Best Warren Buffett Telugu Quotes, Warren Buffett Inspirational, And Motivational, Real-life Sayings (Quotes) In Telugu With Best Images.
If someone is earning one lakh rupees a month, we can brag about them. But what if he earns Rs 270 crore a day, and donates 99% of his assets to a charity. He is no other than the Most Successful Investor, Warren Buffett, the Sixth richest man in the world.
The life of Warren Buffett, who grew up to be the richest man in the world from the level of selling newspapers and coke bottles, is a valuable financial lesson for all of us, and let's look at the biography of such a man, quotes and the economic principles he says.
వారెన్ బఫెట్ తెలుగు కోట్స్, ( వారెన్ బఫెట్ సూక్తులు )
వారెన్ బఫెట్ కొటేషన్స్ తెలుగులో, ఎవరైనా ఒక నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తుంటే వాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ అదే ఒక రోజుకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 270 కోట్లు సంపాదిస్తే అలా సంపాదించడమే కాకుండా తన ఆస్తిలో 99% ఆస్తిని స్వచ్ఛంద సంస్థకు దానం చేసిన ఈయన గురించి ఏమనుకోవాలి. ఆయన మరెవరో కాదు మోస్ట్ Successful ఇన్వెస్టర్ గా పేరుపొంది, ప్రపంచ ధనవంతుల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వారెన్ బఫెట్.
న్యూస్ పేపర్లు, కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయి నుండి ప్రపంచంలోనే ధనవంతుడిగా ఎదిగిన వారెన్ బఫెట్ జీవితం మన అందరికీ ఒక విలువైన ఆర్థిక పాఠం, మరి అటువంటి వ్యక్తి జీవిత చరిత్రను, కోట్స్ ను మరియు ఆయన చెప్పిన ఆర్థిక సూత్రాలను, చూద్దాం.
Warren Buffett Quotes In Telugu - Images
Warren Buffet Telugu Quotes - Text
వారెన్ బఫెట్ గురించి తెలుగులో
1930వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన అమెరికాలోని ఓమాహా పట్టణంలో జన్మించాడు వారెన్ బఫెట్. స్కూల్లో తనతోటి పిల్లలందరూ ఆటపాటలతో గడుపుతున్న సమయంలో ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ లు వేస్తూ, స్టాంపులు అమ్ముతూ, తన తాతగారికిరానా కొట్లో పని చేస్తూ, కొద్ది కొద్దిగా డబ్బులు కూడా పెట్టాడు వారెన్ బఫెట్.
అలా దాచిన డబ్బుతో ఒక పాత పిన్ బాల్ గేమ్ మెషిన్ ను కొని, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉంచాడు. దాంతో మంచి లాభాలు వచ్చాయి. అలా వచ్చిన డబ్బుతో తన 11 ఏళ్ల వయస్సులోనే ఎంతో రిస్క్ తో కూడుకున్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసాడు.
మొదట్లో నష్టాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా లాభాలు రావడం మొదలయ్యాయి. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు బఫెట్. తన 14 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిసారి Income టాక్స్ కట్టాడంటే, వారెన్ బఫెట్ ఏ విధంగా సంపాదించాడో మీరు అర్థం చేసుకోవచ్చు. 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మనకు ఆర్థిక జ్ఞానం ఎంత ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
బఫెట్ కి 19 ఏళ్ల వయసున్నప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోడానికి దరఖాస్తు చేసుకుంటే, చిన్నవాడని వయస్సు సరిపోదని యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది. వారెన్ బఫెట్ కి స్టాక్ మార్కెట్ రంగంలో 'బెంజమిన్ గ్రహం' అంటే ఎంతో అభిమానం. ఆయన రాసిన 'ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' అనే పుస్తకాన్ని చిన్నవయసులోనే బట్టి పెట్టేసాడు 'వారెన్ బఫెట్'. ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకంగా 'ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' పుస్తకం ప్రసిద్ధి చెందింది.
'బెంజిమెన్ గ్రహం' కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారని తెలిసి వారెన్ బఫెట్ కూడా అదే యూనివర్సిటీలో చేరారు. తన కాలేజీలో చదువుతున్నప్పుడే ఒక రోజుకి 176 డాలర్లు సంపాదించేవాడు వారెన్ బఫెట్. ఆ కాలేజీలో క్లాసులు చెప్పే ప్రొఫెసర్లకు కూడా అంత సంపాదన వచ్చేది కాదు. 1962 వ సంవత్సరంలో అప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి 'బెర్క్‌షైర్ హాత్వే' అనే ఒక టెక్స్టైల్ కంపెనీ లో ఎక్కువ మొత్తంలోషేర్లు కొన్నాడు వారెన్ బఫెట్.
ఆయన ఆ కంపెనీల షేర్లు కొనే సమయానికి ఆ కంపెనీ ఒక్కొక్క షేర్ విలువ 7 డాలర్లు అంటే మన ఇండియన్ రుపీస్ లో 500 రూపాయలు ఇప్పుడు ఆ కంపెనీ ఒక షేర్ విలువ 3 కోటి 20 లక్షల పైనే ఇప్పటికీ అదే కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నారు బకెట్. ఇదొక్కటే కాదు, 'కోకో కోల, వాషింగ్టన్ పోస్ట్, ఐబీఎమ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్, జిల్లెట్, వంటి ఎన్నో కంపెనీలలో వారెన్ బఫెట్ కి వాటా ఉంది.
వారెన్ బఫెట్ ఏదైనా కంపెనీలో షేర్ కొన్నాడు అని తెలిస్తే చాలు అందరూ అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టేవారు. దాంతో ఆ కంపెనీ షేర్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయేది. అప్పట్లో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలు వారెన్ బఫెట్ ని తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని బ్రతిమలాడేవి అంటే 'వారెన్ బఫెట్' గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది.
న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుండి మొదలైన ఆయన అప్పటికే వరుసగా 13 సంవత్సరాల నుండి ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్ ను దాటి 2008వ సంవత్సరం లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నెంబర్వన్ స్థాయికి చేరడు వారెన్ బఫెట్.
ఎదో కొంత సంపాదించగానే పెద్ద పెద్ద భవనాలు, పదుల సంఖ్యలో కార్లు, విలాసవంతమైన జీవితం గడిపే వాళ్లున్న ఈ రోజుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒక్కడై ఉండి కూడా ఎప్పుడో 53 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఒక సాధారణమైన ఇంట్లోనే ఉన్నాడు.ఈయన ఇంటికి ఒక గోడ గానీ, సెక్యూరిటీ గానీ, ఏమీ ఉండవు. ఈయన వాడేది ఒక సెకండ్ హ్యాండ్ కారు. ఆ కారుకి డ్రైవర్ గానీ చుట్టూ గాడ్స్ గాని ఎవరూ ఉండరు. ఆయనే స్వయంగా తన కారు నడుపుకుంటారు. అంత సాధారణంగా జీవిస్తుంటారు వారెన్ బఫెట్.
వారెన్ బఫెట్ ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. "నీకు అవసరం లేని వాటిని కొట్టుకుంటూ పోతే, ఏదో ఒక రోజు నీకు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త". ప్రపంచంలోనే ధనవంతుడైన బిల్ గేట్స్ మొదటి సారి వారెన్ బఫెట్ కలవాల్సి వచ్చినప్పుడు, అందరిలాంటి వాడే అనుకొని కేవలం అరగంట మాత్రమే సమయం కేటాయిద్దాం అనుకున్నాడట. కానీ వారన్ బఫెట్ మాటతీరు, మంచితనం, నిరాడంబరత, చూసి ఏకంగా 10 గంటల పాటు ఆయనతో గడిపాడట.
ఆ మీటింగ్ తర్వాత బిల్గేట్స్, వారెన్ బఫెట్ కి అభిమాని గా మారిపోయాడు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అంతే కాదు, బిల్ గేట్స్ నడుపుతున్న' బిల్ అండ్ మిలిందా' అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కి వారెన్ బఫెట్ తన ఆస్తిలో సుమారు 44 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చేశాడు. 44 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ రుపీస్ లో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లకు పైనే.
ఆయనకు ఇప్పుడు ఉన్న ఆస్తులలో సుమారుగా 99% సంపద ఆయనకు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చింది. 'పట్టిందల్లా బంగారం కావడం అదృష్టం బట్టి ఉంటుంది. కానీ, బంగారాన్ని పట్టుకోవడం అనేది నైపుణ్యం బట్టి ఉంటుంది.' వారెన్ బఫెట్ ఆ నైపుణ్యం కావలసినంత ఉంది. ఆ నైపుణ్యం రావడానికి గల ఒకే ఒక్క కారణం పుస్తకాలు ఎక్కువగా చదవడం. ఈయన రోజులో 80 శాతం సమయాన్ని కేవలం పుస్తకాలు చదవడానికి కేటాయిస్తారట. అయితే 2017 వ సంవత్సరంలోఫోర్బ్స్ మ్యాగజిన్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్ రెండోస్థానంలో నిలిచారు.
ఇప్పుడు 2021 లో వారెన్ బఫెట్ ఆస్తి 7 లక్షల 75 వేల కోట్లు. ఇంత సంపాదించడం ఒకెత్తయితే, తాను చనిపోయిన తరువాత తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందేలా వీలునామా రాసి మనసున్న కుబేరుడు అనిపించుకున్నాడు 'వారెన్ బఫెట్'. అతి సామాన్య స్థాయి నుండి సంపన్నుడిగా ఎదిగిన 'బఫెట్' అంత సంపాదన ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా, సామాన్యంగా జీవిస్తున్న ఈయన జీవితం మన అందరికీ స్ఫూర్తిదాయకం. (క్రెడిట్స్:తెలుగుబడి)
తెలుగు కొటేషన్స్